శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రాజు శెట్టి సహకారంతో బీజేవైఎం ఉపాధ్యక్షుడు రుద్రోజు అఖిల్ ఆధ్వర్యంలో మహిళలకు 4వేల శానిటరీ సువిధ నాప్కిన్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా 3వ సువిధ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రోజు రాధమ్మ, ఐటీ సెల్ కన్వీనర్ సత్య కుర్మ, ఆర్.రాధ, అందికేరి మహేశ్, పార్టీ కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.