నమస్తే శేరిలింగంపల్లి: సగర జాతి గౌరవాన్ని పెంచే ఒక దిక్సూచిగా యాదాద్రి పుణ్యక్షేత్రం లో అన్నదాన సత్రాన్ని నిర్మిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. సంఘం చేపట్టిన ఈ యజ్ఞంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని సగర బంధువులందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యాదాద్రి లో నిర్మిస్తున్న శ్రీ యాదాద్రి భగీరథ సగర (ఉప్పర) అన్నదాన సత్ర సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు దిక్సూచిగా యాదాద్రి అన్నదాన సత్రం నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సగరుల సౌకర్యార్థం నిర్మిస్తున్న ఈ సత్రాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గది దాతలతోపాటు ఇతర దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఏడాది కాలంలో సత్రం నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. యాదాద్రి సత్ర సంఘం అధ్యక్షులు కె. పి. రాములు సగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, సత్ర సంఘం కోశాధికారి మదం శెట్టి కృష్ణ సగర, సత్ర సంఘం గౌరవ సలహాదారులు సీతా భద్రయ్య సగర, జాతీయ సాల్ట్ మేకర్స్ క్యాస్ట్ ఫెడరేషన్ నాయకులు కృష్ణ కుమార్ భారతి, బీహార్ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్ మహతో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు ఆర్.బి ఆంజనేయులు సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బంగారు నరసింహ సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ సగర, సత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గిన్నె భీమయ్య సగర, రిటైర్డ్ డిఆర్ఓ భాస్కర్ సగర, మీర్పేట్ కార్పొరేటర్ మోడల బాలకృష్ణ సగర, టీఎస్ న్యూస్ సీఈఓ ఆంజనేయులు సగర, తెలంగాణ నగర మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి సగర, ప్రధాన కార్యదర్శి స్రవంతి సగర, కోశాధికారి పల్లవి సగర, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దబూది సతీష్ సగర, ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, కోశాధికారి సందుపట్ల రాము సగర, వరంగల్ సగర ధర్మకర్తల మండలి అధ్యక్షులు సీతా కమలాకర్ సగర, రాష్ట్ర సంఘం కార్యవర్గం, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్లు పాల్గొన్నారు.
జనగణన ప్రారంభం…
తెలంగాణ రాష్ట్రంలోని సగర జాతి జనగణనను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సగర సంఘం కార్యవర్గం, అన్ని జిల్లాల నాయకత్వాలు, జాతీయ స్థాయి నాయకులు, సీనియర్లు, యాదాద్రి సత్ర సంఘ నాయకులు, మహిళా సంఘం, యువజన సంఘం నాయకులతో కలిసి రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ప్రారంభించారు. తెలంగాణలోని సగరుల జనగణనకు రాష్ట్ర పరిధిలోని సగర బంధువులందరూ సహకరించి ఈ మహత్తర కార్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనగణన తో పాటు తెలంగాణ సగర సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా కొనసాగుతుందని, వీటికి రాష్ట్రంలోని బంధువులు అందరూ కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి సగర బందువు ఈ సభ్యత్వ నమోదును స్వీకరించాలని సూచించారు.