బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

  • 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళితే సహించేది లేదు
  • సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగానే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here