ఈ నెల 18న బీసీ బంద్‌ను విజ‌య‌వంతం చేయాలి: భేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈ నెల 18న‌ తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక బిసి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాలకు, బీసీ సంఘాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, బిసి కులాల్లోని సంఘాలు, బిసి ప్రజానీకం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్, మిగతా పార్టీలు బంద్ కు పూర్తి మద్దతు తెలిపార‌ని అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా బంద్‌లో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలోబర్క కృష్ణ, వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందేలా సత్యనారాయణ యాదవ్, రాజు గౌడ్, పద్మశాలి కిషోర్, నాయి బ్రాహ్మణ సంఘం అశోక్, రజక సంఘం విష్ణు, వటరాజుల సంఘం రాజేష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here