శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఎంఎస్పి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి(డీసీసీ)ఎంపికపై అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యుడు, తమిళనాడు రాష్ట్రం తిరుణవేలి మెంబర్ అఫ్ పార్లమెంట్ రాబర్ట్ బ్రూస్, పీసీసీ ఉపాధ్యక్షుడు కోటం రెడ్డి వినయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోర్డినేటర్ రఘునందన్ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి (డీసీసీ) ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుందని, ఏఐసీసీ ఆదేశాల మేరకు, పీసీసీ సూచనల ప్రకారం అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ జిల్లాలో అందరికీ ఆమోదయోగ్యమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పార్టీ బతోపేతానికి కృషి చేస్తూ వస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎంపీ రాబర్ట్ బ్రూస్ అన్నారు. అభిప్రాయ సేకరణ డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అందరికీ ఆమోదయోగ్యమైన, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన, క్రమశిక్షణతో ఉన్న నాయకుడినే ఎంపిక చేస్తామని డీసీసీ అధ్యక్షుడు, చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి తెలిపారు.

జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కాంగ్రెస్ శక్తిని పునరుద్ధరించేందుకు సమన్వయంగా పని చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కోటం రెడ్డి వినయ్ రెడ్డి అన్నారు. పార్టీ ఐక్యతను కాపాడుతూ, శేరిలింగంపల్లి ప్రజలతో మమేకమైన నాయకత్వంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, డీసీసీ కమిటీలో కూడా యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గం కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీలు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





