నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలోని మహిళా సిబ్బంది భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ శంకర్, సీనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, గిరిదావర్ సీనయ్య, శ్రీకాంత్, వీఆర్ఏ లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
