నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజలకు ఎంతో బాసటగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.27.96 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం పేదలకు సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని చెప్పారు. అనారోగ్యానికి గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ యాదవ్, సత్యనారాయణ, శ్రీనివాస్, కేఆర్ కే రాజు, శ్రీహరి, కిరణ్, అప్పిరెడ్డి, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.