కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా జిల్లా ప్రభుత్వాస్పత్రి : ప్రభుత్వ విప్ గాంధీ – రూ. 25 లక్షలతో కంటి పరీక్షా‌ కేంద్రం ప్రారంభం – భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల కంటే‌ రక్తదానం గొప్పదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేస్తే నిండు ప్రాణాలను కాపాడిన వారవుతారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన, ఆసుపత్రి సూపరింటెండెంట్ వరద చారి, కార్పోరేటర్ హామీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్‌ గాంధీ ప్రారంభించారు.‌

భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా రక్త దానం శిబిరంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషకరమన్నారు.‌ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ఇతర ప్రాణాలు కాపాడిన దైవ సమానులు అవుతారన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతం అని, మహానీయులను స్మరించుకోవడం మన విధి అన్నారు.

కొండాపూర్ ప్రభుత్వాస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

రూ. 25 లక్షలతో కంటి పరీక్షా కేంద్రం ప్రారంభం

కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రూ. 25 లక్షల అంచనావ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 25 లక్షలతో ఏర్పాటు చేసిన కంటి పరీక్షా కేంద్రంతో ఇక్కడి ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందన్నారు. అన్ని రకాల కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

కొండాపూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రి లో కంటి వైద్య పరీక్షా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

ఈ‌ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్ ఆసుపత్రికి దీటుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ లు నగేష్ నాయక్, కార్తిక్, అర్ ఎంవో విజయకుమారి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. వేరొనిక , పాతోలోజిస్ట్ డా. మాలతీ, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ ఆర్. రవీందర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బలరామ్, సబ్ యూనిట్ ఆఫీసర్ పి. శ్రీనివాస్, పీహెచ్ సీ సీహెచ్ వో స్వామి, ఆసుపత్రి సిబ్బంది, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కార్పోరేటర్ రవీందర్ ముదిరాజ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఊట్ల కృష్ణ, రమేష్ పటేల్, జంగం గౌడ్, చాంద్ పాషా, బలరాం యాదవ్, తిరుపతి యాదవ్ , చింతకింది రవీందర్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, గణపతి, నరేష్, రవి శంకర్, వెంకటి, టీ కృష్ణ, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవ రాజు, సాగర్ చౌదరి ఆనంద్ చౌదరి, కుమార్, రూప రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here