నమస్తే శేరిలింగంపల్లి: రాజకీయ దురంధురుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి తీరని లోటని శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గంప సత్యనారాయణ గుప్త పేర్కొన్నారు. రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య మృతి పట్ల శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఆదివారం చందానగర్ గాంధీ విగ్రహం వద్ద రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంప సత్యనారాయణ గుప్త, శేరిలింగంపల్లి అధ్యక్షులు మారం వెంకట్ గుప్త, మండల పొలిటికల్ చైర్మైన్ నటరాజ్ గుప్, పబ్బా మల్లేష్ గుప్త, మశేట్టి ప్రభాకర్ గుప్త, చిన్నం సత్యం గుప్త, పశుపతి శ్రీనివాస్ గుప్త, కోటేశ్వరరావు గుప్త, సంపత్ గుప్త, మహేష్ గుప్త, శ్రీనివాస్ గుప్త, కుమార్ గుప్త, యాదగిరి గుప్త తదితరులు పాల్గొన్నారు.