వర్షం వస్తుందని ఆగితే అనంతలోకాలకు

నమస్తే శేరిలింగంపల్లి: వర్షం వస్తుందని అండర్ పాస్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్రవాహనదారుడిని అశోక లీల్యాండ్ ట్రాలీ వాహనం ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జె.‌తరునాస్ వినోద్ (25) కూకట్ పల్లి వసంత్ నగర్ కాలనీ, భగత్ సింగ్ పార్కు లోని 783/ఏ నంబర్ గల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వినోద్ ఓ ప్రైవేటు కంపెనీలో జూనియర్ సేల్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5 వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో టీఎస్ 07 జీవై 1753 నంబరు గల పల్సర్ బైక్ పై గచ్చిబౌలి బయో డైవర్సిటీ నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తున్న క్రమంలో వర్షం‌ కురుస్తుందని మార్గ మధ్యలో మాదాపూర్ ఐకియా దగ్గర ఉన్న అండర్ పాస్ రోడ్డులో వాహనాన్ని రోడ్డు పక్కనే ఆపుకొని ఉండగా, టీఎస్ 09 యూబీ 4890 నంబర్ గల అశోక లీల్యాండ్ ట్రాలి వాహనం డ్రైవర్ అతివేగంగా నడుపుతూ వినోద్ ను వెనక నుండి ఢీ కొట్టడంతో వినోద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవరు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ పోలీసులు పేర్కొన్నారు. మృతునికి తల్లి, తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు.

టిప్పర్ వాహనం ఢీ కొట్టడంతో మృతిచెందిన వినోద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here