నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంతో గుడిసె దగ్ధమై వీధినపడ్డ కుటుంబ సభ్యులకు ఆర్ కే వై టీం ఆసరాగా నిలిచింది. మక్త మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యులు ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గుడిసె దగ్ధమవడంతో వస్తువులన్నీ కాలిపోయి కట్టుబట్టలతో మిగిలి రోడ్డున పడడంతో స్పందించిన ఆర్ కే వై టీం సభ్యులు బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్, ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ బీజేపీ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజెరావు రాము, గంగారం మల్లేష్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధానకార్యదర్శి కురుమ శ్రీశైలం, జాజేరావు శ్రీధర్, నరేష్, చారి, రాము, మణికంఠ, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
