ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత‌ వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి: ముఖేష్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలందించి భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్ పేట సంయుక్తంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ ఆటో స్టాండ్ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో‌ 150 మందికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన కుమారుడు ముఖేష్ రెడ్డి జ్ఞాపకార్థం ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పేదలకు ఉచిత‌ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ కు చెందిన క్యాంపు నిర్వాహకులు విజయచందర్ మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరంలో పాల్గొన్న పేషెంట్లకు ఎవరికైనా మరిన్ని పరీక్షలు, వైద్య చికిత్సల కోసం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ముఖేష్ ఛారిటబుల్ ట్రస్టు తరపున వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పండ్లు, బిస్కట్ ప్యాకెట్స్, కరోనా నివారణకు ఉపయోగపడే మాస్క్ లు, శానిటైజర్లు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖేష్ ఛారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మనీష్ రెడ్డి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు డా. పవన్ కుమార్, డా. మౌనిక, సిబ్బంది సిస్టర్ మేరీ జాస్, సిస్టర్ అహన, సిస్టర్ సాయిమ్మలతో పాటు క్యాంపు మేనేజర్ విజయచందర్, ప్రకాష్, తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు డా. పుండరీకం, డా. శివశంకర్, డా. ఆంజనేయులు, డా. వెంకట్, డా. గోవింద్ రాజు,‌ డా. చారీ, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత‌ వైద్య శిబిరం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here