శేరిలింగంపల్లి, అక్టోబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ ఎమ్ టి శాతవాహన నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రివైటల్ డెంటల్ హాస్పిటల్ ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని హంగులతో , సకల సౌకర్యాలతో అత్యాధునిక పరికరాలతో రివైటల్ డెంటల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది అని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుంది అని , ఈ చక్కటి సదవకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, పేద ,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు వైద్యం అందించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






