శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): అడ్డగుట్ట సొసైటీ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లను ఆక్రమించి, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా వ్యాపారాలు నిర్వహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు, నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .ఈ సమస్యపై కాలనీవాసులు పలుమార్లు PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మంగళవారం స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు , షాపులను అధికారులతో కలిసి తొలగించారు. ఈ చర్యతో అడ్డగుట్ట సొసైటీ మహిళలు, కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అడ్డగుట్ట కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేయడం జరిగిందని, అడ్డగుట్ట రోడ్డు నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని , ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణ చేపట్టడం జరిగిందని అన్నారు. వ్యాపారం చేసుకోవడం ఎవరికీ నిషేధం కాదు. కానీ ఇతర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా షాపులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ప్రజా సమస్యలపై నిర్దాక్షిణ్యంగా చర్యలు కొనసాగుతాయి అని PAC చైర్మన్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





