స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో సిసి రోడ్లు ఎక్కడెక్కడ వేయాలో వాటి గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యల గురించి జిహెచ్ఎంసి ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సమస్యలను వివరించి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం గురించి అసోసియేషన్ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వినతి పత్రం ఇచ్చారు. నేతాజీ నగర్ లో ప్రధాన సమస్య మురుగునీరు అని డ్రైనేజీ స‌రిగ్గా లేద‌ని, వీధిలైట్ల‌కు మరమ్మత్తులు చేయాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయుడు, రవి నాయక్, శారద, మోహన్ చారి, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here