సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్, ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మసీదు బండ కొండాపూర్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దుస్తులు, ఉచిత నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ యజమాన్యం చేపట్టింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడంలో త‌మ‌ ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా అనేక సేవ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతుంద‌ని అన్నారు. ఇందుకు సంతోషంగా ఉంద‌న్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఈ సమాజానికి, కన్న‌ తల్లిదండ్రులకు , విద్య నేర్పిన గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉమాదేవి , శ్రీనివాస్ ,సదానంద్ యాదవ్, ఆంజనేయులు సాగర్, శ్రీశైలం,రాజు యాదవ్ ,కుమార్, శ్రీకాంత్, అరుణ్ కుమార్, చంద్రశేఖర్, లక్ష్మణ్, పద్మ పాల్గొన్నారు.

పుస్త‌కాల‌ను పంపిణీ చేస్తున్న బిక్షపతి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here