శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): సుభాష్ చంద్రబోస్ నగర్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివగౌడ్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు లాయర్, కాలనీ చీఫ్ అడ్వైజర్ కేఎల్‌బీ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్ ఎండీ సాజిద్ అలీ, ఎం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎండీ మోసిన్ ఖాన్, ఉపాధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, సాబీర్, ఎన్.నరసింహ, రాములు యాదవ్, జాయింట్ సెక్రెటరీ టి. భుజంగం, ముక్తార్, గౌస్, శ్రీధర్, ట్రెజరర్ నరసింహా రావు, పాండు, వాజిద్, ముజీబ్, శ్రీను, శశిరేఖ, శ్రీజ రెడ్డి, మొగులమ్మ, న్యూ మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎండీ అయూబ్, ఈక్రమ్, హమీద్, లతీఫ్, అఫ్సర్ ఖాన్, వెంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.