శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సువర్ణ, అక్షయ, అర్చన ఆశ్రిత, నారాయణి, కలిసి జయ పతాకము నెత్తర అనే దేశ భక్తి గీతాన్ని ఆలపించారు, ఆలయం అర్చకులచే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.