శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వార్డ్ కార్యాలయంలో డివిజన్ కార్యకర్తలు, నాయకులతో కలిసి కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.