శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): సరస్వతీ విద్యా మందిర్ చందానగర్ లో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ పి మోహన్ రెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ప్రాజెక్టు ఆఫీసర్ ఉషారాణి, EE KV రాజు, జిహెచ్ఎంసి సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యారు. కమిషనర్ మోహన్ రెడ్డి, ఉషా రాణి, కె.వి రాజు ఓటర్స్ డే ప్రాధాన్యతను వివరించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ మరియు రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 9వ తరగతి స్టూడెంట్స్ K.సిద్దార్థ్, D. నేహామృత లకు జిల్లా కలెక్టర్ చే ఇష్యూ అయిన సర్టిఫికెట్లను అందజేశారు. వక్తలు అందరూ సరస్వతి విద్యా మందిర్ విద్యార్థుల ప్రతిభను, క్రమశిక్షణను, ఉపాధ్యాయుల అంకిత భావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోశాధికారి నాగభూషణరావు, జాయింట్ సెక్రెటరీ రామచంద్రారెడ్డి, స్థానిక పెద్దలు రఘుపతి రెడ్డి, గోవర్ధన్, పాఠశాల హెచ్ఎం అరుణ పాల్గొన్నారు.
ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..
సరస్వతీ విద్యా మందిర్ చందానగర్ లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగభూషణ రావు ఈ సందర్భంగా విద్యార్థులకు ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు నాగభూషణ రావు, సుదీప్ రెడ్డి, దుర్గా మల్లేశ్వర రావు, రామచంద్రారెడ్డి బహుమతి ప్రధానం చేశారు. స్కూలు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిని ఇతర సిబ్బందిని పాఠశాల జాయింట్ సెక్రటరీ రామచంద్రారెడ్డి అభినందించారు.