శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చందానగర్ మున్సిపల్ కార్యాలయం, శంకర్ నగర్,వేమన రెడ్డి కాలనీ, పలు కాలనీలలో కాలనీ అసోషియషన్ వాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు గురుచరణ్ దుబే, పులిపాటి నాగరాజు ,పబ్బ మల్లేష్ ,ఓ.వేంకటేష్, అక్బర్ ఖాన్ ,అమంజద్ పాషా ,యుసుప్, నరేంద్ర భల్లా, సందింప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.