నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అభివృద్ధికి రెడ్డి సంక్షేమ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని రెడ్డి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని సీతారామంజనేయ స్వామి అలయం ఆవరణలో ఉమ్మడి జిల్లా వెల్ఫేర్ అసోషియేషన్ ఆఫ్ రెడ్డి వార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లా సంజీవ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పార్టీలతో విబేధాలు లేకుండా రెడ్డిల సంక్షేమానికి కృషి చేసే ప్రభుత్వాలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
రెడ్డి రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం రెడ్డి సంక్షేమ సంఘం కృషి చేస్తుందన్నారు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 శాతానికి సంబంధించిన జీఓ ను అర్హత గల వారికి వర్తించేలా పాటుపడుతామని చెప్పారు. రెడ్డి సంక్షేమ సంఘం ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు పాల్పడకుండా నిజాయితీగా నిస్వార్థంతో సమాజంలో సేవలు చేస్తుందన్నారు. రెడ్డి సామాజిక వర్గం వృద్ధి కోసం పనిచేయల్సిన అవసరం ఎంతైనా ఉందని, న్యాయంగా మనకు రావలసిన హక్కుల గురించి రెడ్డి జాతిని జాగృతం చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రెడ్డి సామాజిక వర్గానికి వర్తించేలా ప్రభుత్వాన్ని ఒప్పించేలా చేస్తామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పనకు పాటుపడుతామని అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉంటేనే సమస్యలు తీరుతాయన్నారు. యోగి వేమన విజ్ఞాన కేంద్రం పునఃప్రారంభానికి సంఘం కృషి చేస్తుందని తెలిపారు. మే 29 న హైదరాబాద్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రెడ్ల మహాగర్జన మహాసభ ఘాట్ కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 9 వద్ద వరంగల్ హైవే వందన హోటల్ సమీపంలో ఉంటుందన్నారు. రాష్ట వ్యాపంగా ఉన్న రెడ్డి బాంధవులు ఈ మహాసభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ల సంఘం అధ్యక్షుడు కైల దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అంతి రెడ్డి రవీందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మోహన్ రెడ్డి, రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.