హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి) : బీసీలకు 75 ఏళ్లకు పైగా ఈ దేశంలో అన్యాయం జరుగుతుందని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. బీసీల డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఈ రణభేరి గ్రామ గ్రామాన కొనసాగుతూనే ఉంటది అని అన్నారు. బీసీలు బీసీ హక్కుల కోసం ఉద్యమాలలో పాల్గొని నాయకత్వాన్ని పెంపొందించుకొని ప్రజాప్రతినిధులుగా ఎదగాలని కోరారు. బీసీలకు 27% రిజర్వేషన్లు కాకుండా జనాభా ప్రాతిపదికన 50% ఇవ్వాలని అన్నారు. బీసీలంతా ఐక్యమై ఈ రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జాతీయ బీసీ సంఘం విద్య కృష్ణ, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, రాష్ట్ర బీసీ నాయకుడు వేణుగోపాల్, వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్, బీసీ సంఘం నాయకుడు, గొర్రెల మేకల పెంపకం దారుల వనపర్తి జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెల కుమార్ యాదవ్, రమేష్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, వడ్డే యాదయ్య, నాయి బ్రాహ్మణ సంఘం కిరణ్, రజక సంఘం అశోక్, మేదరి సంఘం వెంకట్, మైనార్టీ సంఘం ముస్తఫా, తెలంగాణ రాష్ట్ర బీసీ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు.