ఘ‌నంగా శివ‌పార్వ‌తుల క‌ల్యాణోత్స‌వం

శేరిలింగంపల్లి, నవంబర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి) : శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ లోని బస్ బాడీ రోడ్డులో ఉన్న‌ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ కాళిమాత ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనగా నిర్వహించారు. ఈ శివ పార్వతుల కళ్యాణ‌ మహోత్సవంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంత‌రం నిర్వహించిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ఏకాంత్ గౌడ్ పాల్గొన్నారు.

క‌ల్యాణోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్న దృశ్యం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here