పూరీ తీరాన కేసీఆర్ సైకత శిల్పం… రవిందర్ యాదవ్ కృషిని కొనియాడిన ఎమ్మెల్సీ కవిత…

  • ఛలో వరంగల్ సభ విజయవంతం కోసం పూరీ తీరాన సైకత శిల్పం
  • 25 ఏళ్ల సంబరంకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని రవీందర్ యాదవ్ ఏర్పాటు
  • సైకత శిల్పం వీడియోను తన నివాసంలో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
  • శేరిలింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున సభకు తరలిరావాలని ఎమ్మెల్సీ కవిత సూచన

నమస్తే శేరిలింగంపల్లి: భారాస నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు సంబంధించి పూరీ తీరాన ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన ఛలో వరంగల్ సభ పేరిట శేరిలింగంపల్లికి చెందిన రవీందర్ యాదవ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. అధినేత కేసీఆర్ చిత్రపటంతో పాటుగా ఛలో వరంగల్, 25 ఏళ్ల ప్రస్థానంకు సంబంధించిన వివరాలను అందులో పేర్కొన్నారు.

పూరీ తీరాన తాను చేయించిన సైకత శిల్పం వద్ద రవిందర్ యాదవ్

తెలంగాణలోని ప్రతి ఒక్కరు సభకు తరలి రావాలని కోరుతూ ఏర్పాటు చేసిన సైకత శిల్పంకు సంబంధించిన వీడియోను రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవితను కలిసి వివరించారు. సైకత శిల్పం వీడియోను చూసి చాలా బాగుందని కితాబు ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను ఎమ్మెల్సీ కవిత రవీందర్ యాదవ్ తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సైకత శిల్పం వీడియోను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కవిత

అలాగే శేరిలింగంపల్లి నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, వారికి అన్ని దగ్గరుండి చూసుకోవాలని రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఉద్యమ స్ఫూర్తిని చాటేలా శేరిలింగంపల్లి గులాబీ సైన్యం కదిలి రావాలని స్పష్టం చేశారు. భారీ సంఖ్యలో సభకు తరలి వస్తామని రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా కవితకు తెలిపారు. ఇంటికి ఒక్కరూ తమ నియోజకవర్గం నుంచి తరలి రానున్నట్లుగా స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here