శేరిలింగంపల్లి, ఏప్రిల్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో మైన్ డైమండ్ షోను ప్రారంభించారు. మే 2వ తేదీ వరకు కొనసాగనున్న ఈ షోలో ప్రత్యేక వజ్రాభరణాలను ప్రదర్శిస్తున్నారు. ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలతోపాటు వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు. కనుక వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా వజ్రాభరణాలను కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు.
గోల్డ్, అన్‌కట్ & జెమ్ స్టోన్ ఆభరణాల తరుగు ఛార్జీలపై, వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపును పొందవచ్చు. అడ్వాన్స్ బుకింగ్‌తో ఒక వెండి నాణెం ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ను మే 4వ తేదీ వరకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చని, తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ది పొందవచ్చని అన్నారు. ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు, బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర, ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉందన్నారు.