శేరిలింగంపల్లి, డిసెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లో ఇందిరమ్మ ఇండ్ల కోసం తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఇండ్లు లేని ప్రతి పేదవారి కోసం ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని , నెలాఖరులోగా (31 తేదీ ) ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ పూర్తి అవుతుందని, 500 మందికి ఒక సర్వేయర్ ఉంటారని ప్రతి ఒక్కరు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేసారు.
ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తారని , ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారని, ఎవరి ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు, ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తిస్తున్నారని, దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అన్నారు. ఒకవేళ దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అన్నారు.