- పోలా రంగనాయకమ్మ ట్రస్టులో ఘనంగా యోగా దినోత్సవం
- నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని పోలా రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్టు సభ్యులు, స్థానికులు ప్రత్యక్షంగా యోగా సాధన చేయగా, ఇతరులు ఆన్‌లైన్‌లో యోగాను ఆచరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పతంజలి యోగ సమితి ప్రముఖ యోగా గురువు, రాష్ట్రపతి అవార్డు గ్రహిత శివకుమార్ యోగాలోని మెలకువలను సాదకులకు తెలియ జేశారు. యోగా అంటే కేవలం వ్యాయామం, ప్రాణాయమం మాత్రమే కాదని, యోగా అంటే జీవన విధానమని అన్నారు. జీవాత్మను పరమాత్మతో ఏకం చేసే సాధనమే యోగా అని తెలిపారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్టు చైర్మన్ పోలా వాణీ కోటేశ్వర్‌రావులు మాట్లాడుతూ యోగా దినోత్సవం నాడు మిత్రులతో కలిసి యోగా అభ్యాసం చేయడం, గురువు శివకుమార్ ద్వారా అనేక కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు. అదే విధంగా కొందరు 20 నిరుపేద కుటుంబాలకు తోచిన రీతిలో నిత్యావసరాలను పంపిణీ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సౌందర్యాలహరి హైదరాబాద్ ప్రెసిడెంట్ భాను శిరీష, ట్రస్టు ప్రతినిధులు అంతిరెడ్డి, గోవిందు, మోహన్‌రావు, జయకుమార్, బీఎస్‌కే చంద్రశేఖర్, పసుమర్తి శ్రీనివాస్‌రావు, పబ్బ శ్రీనివాసం, శిరీష, జితమన్యూ, సాయి సుజిత్, సంతోష్‌రెడ్డి, శ్రీకాంత్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.