నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా వైధ్యాధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, ఉప వైద్యాధికారి డాక్టర్ సృజన, డీఎంఓ డాక్టర్ సీఎచ్ రాకేష్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాభ నియంత్రణలో భాగంగా విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బందికి అవార్డులు అందజేశారు. కాగా హఫీజ్‌పేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ ఇ.పండరిరెడ్డి, అకౌంటెంట్ బి.సంతోష్‌కుమార్‌లు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులు వారికి జ్ఞపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజురోజుకు ప్రపంచ జనాభ పెరిగిపోతున్నదని, ముఖ్యంగా భారతదేశంలో ఆ సంఖ్య ఘననీయంగా పెరుగుతుందని అన్నారు. జనభా నియంత్రణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిక డాక్టర్ వినయ్ బాబు, డాక్టర్ నాగమణి, ఏపీఎంఓ రమేష్ నాయక్, స్టాఫ్ నర్సులు కవిత, స్నేహలత, రాజ్‌కుమార్, ఎల్‌టీఈ పద్మ తదితరులు పాల్గొన్నారు.