నమస్తే శేరిలింగంపల్లి: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలు తమలో రాజకీయ స్ఫూర్తిని నింపాయని, ఆయన ఆదేశాలతో మరింత ఉత్సాహంగా పనిచేసి గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేందుకు పాటుపడుతానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమావేశమైన సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ చెప్పిన మాటలను వివరించారు.
తెలంగాణలో సుపరిపాలన లక్ష్యంగా, కేసీఆర్ ప్రభుత్వ దుష్పరిపాలనకు స్వస్తి పలికేందుకు పార్టీ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకం బిజెపి వైపు చూస్తోందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారని చెప్పారు. బిజెపికి 80 నుండి 90 సీట్లు వస్తాయని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను సాధించిన తర్వాత ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి ప్రయత్నించడం పట్ల మోదీ అభినందించారని అన్నారు. ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టి, అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయం చేయాలనే దానిపై కూడా విస్తృత చర్చలు చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో సుపరిపాలన లక్ష్యంగా, వంశపారంపర్య దుష్పరిపాలనకు ముగింపు పలికేందుకు బిజెపి పని చేస్తుంది అని ప్రధాని మోడీ అన్నారని తెలిపారు.
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమలో రాజకీయ స్ఫూర్తిని నింపాడని, ఆయన ఆదేశాలతో తమ తమ డివిజన్ లలో పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని గంగాధర్ రెడ్డి చెప్పారు. నగర కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, పెద్దలతో జరిగిన సమావేశంలో తోటి కార్పొరేటర్ల తో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాoగా పనిచేస్తామని, ఇది మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు. వారి నుండి మేము ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. సాధారణ కార్పొరేటర్ల మైన మేము దేశ ఆతున్యత పదవిలో ఉన్న ప్రధానమంత్రిని కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ బిజెపి కార్పొరేటర్లు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.