ప్లీనరీ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు పాటించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయా కమిటీలకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 27న మాదాపూర్ హెచ్.ఐ.సి.సి లో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను, సభా వేదిక ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్ చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.

ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ కు వివరిస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ

ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధుల కోసం చేసిన ఏర్పాట్లు, సభావేదిక, వాహనాల‌ పార్కింగ్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పలు అంశాల మీద చర్చించారు. ఆయన వెంట తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చలపతి రావు, సురేష్ గౌడ్, కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ ప్లీనరీ సభావేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here