ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, డిసెంబ‌ర్ 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో సి సి కెమెరాల ఏర్పాటు కోసం రూ.4 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే SDF FUNDS నిధులతో సి సి కెమెరాల ఏర్పాటు పనులను కాలనీవాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో రూ. 4 లక్షల అంచనా వ్యాయంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా స్టాలిన్ నగర్ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను పరిశీలించడం జరిగిందని, సీసీ కెమెరాల ను త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కాలనీలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయి అని, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పై కాలనీ వాసులకు విస్తృత ప్రచారం తో అవగాహన కల్పిస్తున్నారని , ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుల తో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ నగర్ కాలనీ వాసులు వెంకటేష్, రాణి మోహిన్, హనుమంతరావు, శ్యామల, సంగీత, రమేష్, జమీర్ బాయ్, రాజు, రమేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here