నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్ పెట్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు బేరకా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్, అంగన్ వాడీ విద్యార్థులకు పలకలు, నోట్ బుక్స్ తదితర వస్తువులను బేరకా చర్చ్ వ్యవస్థాపకులు యేసుపాదంతో కలిసి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, పేద విద్యార్థుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల చేయూతకు ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ మైనారిటీ నాయకులు సయ్యద్ గౌస్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, బేరకా హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు శ్యామ్ బాబు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.