నమస్తే శేరిలింగంపల్లి: ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఎంతైనా ఉందని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చందానగర్, హఫీజ్ పేట్ డివిజన్ల కార్పొరేటర్లు మంజులరఘునాథ్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అంకుర్ ట్రీహౌస్ ప్రైమరీ, ప్రీ ఫ్రైమరీ పాఠశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. చిన్నారులు పర్యావరణ పరిరక్షణ కోసం, మొక్కలు నాటి ప్రకృతిని కాపాడే తదితర అంశాలపై కళ్లకు కట్టినట్లు నాటక ప్రదర్శనలో చేసి చూపించారు.
పాఠశాల ఆవరణలో పిల్లలు మొక్కలను నాటడంతో పాటు ప్రకృతిని, పర్యావరణాన్ని సంరక్షించాలని, వాయు కాలుష్యానికి సహకరించడం మానేయాలని, ప్లాస్టిక్ వినియోగం వద్దంటూ, మట్టి, సహజ వనరులను కాపాడుకోవాలని నినాదాలు చేశారు. కార్పొరేటర్లు మాట్లాడుతూ చిన్న నాటి నుంచే ప్రకృతిపై, పర్యావరణ రక్షణపై అవగాహన కల్పించడం హర్షనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జ్యోతి, ప్రిన్సిపాల్ స్వాతి, ప్రమీల, నజ్మా, స్రవంతి, తదితరులు ఉన్నారు.