నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని తారానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి ఉచిత నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, రబ్బర్లు, షార్ప్ నర్లు, స్కేళ్లు, తదితర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని, పేద విద్యార్థుల సంక్షేమం కోసం మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థానాలను పొందాలనే సదుద్దేశంతో, 13 సంవత్సరాలుగా విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవ సమితి చైర్మన్ కొండల్ రెడ్డి, చందర్ రావు, మాజీ వార్డ్ మెంబర్ రమణకుమారి, షైఫుల్లహ ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
