ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు – 8వ బెటాలియ‌న్ క‌మాండెంట్ పి. ముర‌ళీ కృష్ణ‌

నమస్తే శేరిలింగంపల్లి: విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను ఎన్నటికీ మరిచిపోకూడదని, క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎనిమిదో బెటాలియన్ కమాండెంట్ పి. మురళీ కృష్ణ అన్నారు. సంద‌య్య మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో శేరిలింగంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్ష‌ప‌తి యాద‌వ్, బిజెపి రాష్ట్ర‌ నేత, ట్ర‌స్ట్ సెక్రటరీ రవి కుమార్ యాద‌వ్ స‌మ‌క్షంలో కొత్త‌గూడ‌, మ‌సీద్ బండ‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్దుల‌కు ఉచితంగా నోటు పుస్త‌కాలను కమాండెంట్ మురళీ‌ కృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా క‌మాండెంట్ ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ ఉచితంగా నోటు బుక్‌లు పంపిణీ చేస్తూ విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం స‌హ‌క‌రిస్తున్న బిక్ష‌ప‌తి యాద‌వ్, ర‌వికుమార్ యాద‌వ్‌ల‌ను అభినందించారు. 20 సంవ‌త్స‌రాలు విద్యార్థుల‌కు ఉచితంగా నోట్ పుస్త‌కాలు పంచడం విద్య‌ప‌ట్ల వారికి ఉన్న శ్ర‌ద్ధను తెలియ‌జేస్తుంద‌ని అన్నారు. బాల్యంలోనే చ‌దువుకు మంచి పునాదులు ప‌డితే గొప్ప గొప్ప ఉద్యోగాల్లో, మంచి స్థానాల్లో ఉంటార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివితే ఉన్న‌త స్థానాల‌కు చేరలేర‌నేది ఓ అపోహ మాత్ర‌మే అన్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్య‌న‌భ్య‌సించి మంచి మంచి స్థానాల్లో చాలా మంది ఉన్నార‌ని తెలిపారు.

సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న 8వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ

మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్ష‌ప‌తి యాద‌వ్ మాట్లాడుతూ క‌ష్ట‌ప‌డి చ‌దివితే రానున్న‌ జీవితంలో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని తెలిపారు. ఉపాధ్యాయులు మ‌న‌ల్ని శిక్షిస్తున్నారంటే మంచి చ‌దువు రావడానికి మాత్ర‌మే అన్నారు. త‌ప్ప‌కుండా బాగా చ‌దివి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల పేరు, విద్య నేర్పిన గురువుల పేర్లు నిల‌బెట్టాల‌ని సూచించారు. బిజెపి నేత ర‌వి కుమార్ యాద్ మాట్లాడుతూ పేద పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశ్యం తో ఈ ట్రస్ట్ ద్వారా శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా పుస్త‌కాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్త్వం అలవరచుకొని నాయకత్వ లక్షణాలను పెంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజం నిర్మించటం లో నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా ముందుడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, అనంత రెడ్డి, నరసింహ యాదవ్, అనంత రెడ్డి, నాగులు గౌడ్, రఘునాథ్ యాదవ్, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, సదానంద్ యాదవ్, ఆంజనేయులు, మధు యాదవ్, శ్రీనివాస్, గణేష్, రాము, అరుణ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రాజు యాదవ్, సురేష్, అశోక్, దేవేందర్ యాదవ్, పద్మ, వినీత సింగ్, రేణుక, నాగు బాయ్, మల్లికా, తదితరులు పాల్గొన్నారు.

మసీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here