ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా జనాభా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు, స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం, మానవ హక్కులు, బాల్యవివాహాలు, కుటుంబ సంక్షేమం అధిక జనాభా వల్ల కలిగే నష్ఠాలు వంటి విషయాలపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం అన్నారు.

ఆశా వర్కర్లను సన్మానించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు

జనాభా పెరుగుదలతో ఉద్యోగ, ఉపాధి, ఆహార, విద్య, వైద్యం, గృహ వసతి కల్పన, పరిశుభ్రమైన మంచినీరు, శాంతిభద్రతలు రవాణా సమస్యలతో పాటు అభివృద్ధికి ఆటంకం, ఇంకా అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన లోపించడంతో జనాభా పెరుగుతుందని అన్నారు. కుల, మతాలకతీతంగా, జనాభాను నియంత్రణకు కుటుంబ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. శాశ్వత పద్ధతులు ట్యూబెక్టమి, వ్యాసెక్టమి, డబుల్ బటన్ హోల్ వంటి ఆపరేషన్ లాంటి శాశ్వత పద్ధతులతో కుటుంబ నియంత్రణ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పాటించని దంపతులను మోటివేట్ చేసే ఆశా వర్కర్స్ ను శాలువా బహుమతులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆర్.రఘునాధ్ రావు, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వర రాజు, విష్ణు ప్రసాద్, పాలం శ్రీను, జి.వి. రావు, శివరామకృష్ణ, ఉమా చంద్ర శేఖర్, జాకీర్, జనార్దన్ , అమ్మయ్య చౌదరి, సాంబశివ గౌడ్, జిల్ మలేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here