శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ 21లో టీఎల్ఎఫ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే 2 నెలల లోపు 3782 నూతన మహిళా సంఘటాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అందులో భాగంగా వార్డుల వారిగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళ తమ వంతు బాధ్యతగా సంఘాలలో చేర్పించేందుకు కృషి చేయాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకున్న వారు తమ దరఖాస్తులను సర్కిల్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారి నుంచి కొత్త పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు తీసుకోవడానికి ఆదేశించినందున అర్హులను దరఖాస్తులు సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. సర్కిల్ డీసీ మాట్లాడుతూ కొత్త సంఘాల ఏర్పాటు జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. కాలనీ సంఘాల అధ్యక్షులతో వార్డు కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను చందానగర్ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కూడా డీసీ మోహన్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఎల్ఎఫ్ ఓబీ మెంబర్లు, ఆర్పీలు, యూసీడీ సిబ్బంది పాల్గొన్నారు.