శ్రీ‌ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో ఘ‌నంగా నాగుల చ‌వితి ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ వేముకుంటలో ఉన్న శ్రీ‌ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో శనివారం నాగులచవితి ఉత్సవాల‌ను భక్తి శ్రద్దలతో నిర్వ‌హించారు. ఈ సంద్భంగా సుమారుగా వెయ్యి మంది భక్తులు ఉదయం 5 నుండి మధ్యాన్నం 2 గంటల వరకు మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతకు, సుబ్రహ్మణ్యస్వామికి పాలతో అభిషేకించి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.అలాగే పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గుర్ర‌పు రవీందర్ రావు, దేవాలయ ట్రస్టీ విజయ లక్మి , నాగేశ్వర్ రావు, దేవాలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here