రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

మాదాపూర్, సెప్టెంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ గోకుల్ ప్లాట్స్ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన అంతర్గత సీసీ రోడ్లను దశల వారిగా పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ నాయకులు సాంబశివరావు, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్, పితాని శ్రీనివాస్, సంజీవ రెడ్డి, శివాజీ, బృందారావు, సాంబయ్య, ప్రభాకర్, కృష్ణ, అష్రాఫ్, కరీం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here