శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): దీపావళి సందర్బంగా క్రాకర్స్ షాప్స్ వ్యాపారస్తులకి మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు పలు ముఖ్య సూచనలు చేశారు. క్రాకర్స్ షాప్స్ ని రోడ్డు పైన, ఫుట్‌పాత్ ల పైన పెట్టకూడదని, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, ముందస్తుగా ఎటు వంటి పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన షాప్స్ తొలగించబడతాయని, పాదచారులకు అంతరాయం కలిగిస్తూ షాప్స్ ఏర్పాటు చేయకూడదని అన్నారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే అలాంటి క్రాకర్స్ షాప్స్ కి పోలీస్ పర్మిషన్ ఇవ్వబడదని హెచ్చరించాఉ. అంతరాయం కలిగించే షాప్స్ ని ఎటు వంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగిస్తామని అన్నారు. ఈ మేరకు వ్యాపారస్తులు ఈ సూచనలను తప్పక పాటించాలని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.






