శేరిలింగంపల్లి, అక్టోబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ లోని మార్తాండనగర్ లో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో ఏర్పాటుచేసిన బర్త్ డే కేక్ ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. అనంతరం పారిశుధ్య కార్మిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీ ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






