శేరిలింగంపల్లి, అక్టోబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మదీనాగూడ హీలిక్స్ హాస్పిటల్ వద్ద యు-టర్న్‌ను మార్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ తెలిపారు. మదీనాగూడ హీలిక్స్ హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కొనసాగుతున్నట్లు పరిశీలించామని అన్నారు. అందులో భాగంగానే ట్రాఫిక్ క్రమబద్దీకరణకు గాను అక్కడ ఉన్న యు-టర్న్‌ను మరో చోటుకు మార్చినట్లు తెలిపారు. హీలిక్స్ హాస్పిటల్ వద్ద ఉన్న యు-టర్న్‌ను అక్కడే ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు మార్చామని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.






