శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మియపూర్ లో అన్ని చెరువులకు సుందరీకరణ భాగ్యము కలిగిందని, త్వరలోనే మియపూర్ రూపురేఖలు మారుతాయని అన్నారు. చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.