రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడొచ్చు – మియాపూర్ పోలీసుల రక్తదాన శిబిరంలో మెజిస్ట్రేట్ భవాని

నమస్తే శేరిలింగంపల్లి: రక్తదానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కాపాడినవారమవుతామని కూకట్ పల్లి మెజిస్ట్రేట్ భవాని అన్నారు. మియాపూర్ పోలీసులు, జెన్నీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెజిస్ట్రేట్ భవాని మియాపూర్ సీఐ తిరుపతి రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల‌ కంటే రక్తదానం చాలా గొప్పదన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చని, రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం వచ్చి మరింత ఆరోగ్యవంతులుగా‌ ఉంటారని చెప్పారు. మియాపూర్ పోలీసులు ‌రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం లో దాతల ద్వారా సేకరించిన 60 యూనిట్ల రక్తాన్ని మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ కాంతా రెడ్డి, ఎస్ఐ లు రాఘవేందర్, యాదగిరి రావు, జగదీశ్వర్, రవికిరణ్, దశరత్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రక్తదాన శిబిరాన్ని మియాపూర్ సీఐ తిరుపతి రావుతో కలిసి సందర్శించిన కూకట్‌పల్లి మెజిస్ట్రేట్ భవాని
స్వయంగా రక్తదానం చేస్తున్న సీఐ తిరుపతి రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here