నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ఎంతో సందడిగా ఉంది. క్రాప్ట్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్, హస్తకళా ఉత్పత్తులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉపేంద్ర మహారథి శిల్ప అనుసంధానం సంస్థాన్ వారు ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్స్ రుచులు భోజన ప్రియులను నోరూరించేలా ఉన్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సిద్ధేంద్ర ఇన్ స్టిట్యూట్ అఫ్ కూచిపూడి డాన్స్ గౌతమీ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. ఝేమ్ ఝేమ్ తనను, పుష్పాంజలి, మూషిక వాహన, జయము జయము, శివాష్టకం, దుర్గే, విన్నపాలు తదితర అంశాలను మౌనిక, పూజ, వైష్ణవి, అక్షర, లాస్య, ఆరాధ్య, ఆశ్రిత ప్రదర్శించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కళాకారుల జానపద నృత్యాలు, పాటలు అలరింపజేశాయి.