నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో ఆదివారం మేగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ వరదాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాస్పటల్ లోని బ్లడ్ బ్యాంక్ సేవలను విస్తృత పరిచే క్రమంలో భాగంగా ప్రత్యేకంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీ లవ్ ఎన్జీఓ సహకారంతో చేపడుతున్న ఈ శిబిరానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, జిల్లా వైద్యాధికారి, స్థానిక కార్పొరేటర్ లను అతిథులుగా ఆహ్వానించినట్లు వారు తెలిపారు. జిల్లా పరిధిలోని యువత, ఔత్సైహికులు పెద్దసంఖ్యలో ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా విజృంభన నేపథ్యంలో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు పడిపోయాయని, ఈ క్రమంలోనే కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో రక్త నిల్వలను పెంచేందుకు ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.