నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్ వద్ద గల మెడికుంట కుంట చెరువు అభివృద్ధి కోసం రూ. 2.13 కోట్ల అంచనావ్యయంతో చేపట్టనున్న చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మేడికుంట చెరువును సంరక్షించుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు. మురికి నీరు చెరువులో కలవకుండా మురికి నీటి కాలువ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం, పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ వంటి పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీఈ నళిని, ఏఈలు పావని మహేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
