మల్లారెడ్డిపై మండిపడ్డ శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నేతలు – చందానగర్ లో మంత్రి దిష్టిబొమ్మ దహనం

నమస్తే శేరిలింగంపల్లి: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి చేసిన వాఖ్యలపై యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు జాస్పర్ రాజన్, దుర్గం శ్రీహరి గౌడ్ ల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో ఆస్తులు పెంచుకున్న మల్లారెడ్డి అధికార మదంతో విర్రవీగుతున్నాడని ధ్వజమెత్తారు. మంత్రి హోదా మరిచి గల్లీ లీడర్ లా అసభ్య పదజాలంతో దూషించిన మల్లారెడ్డి వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని సూచించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తిపై అవాకులు చవాకులు పేలిస్తే యూత్ కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి మల్లారెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆయాజ్ ఖాన్, జహంగీర్, అజీమ్, దుర్గ దాస్, దుర్గేష్, శ్రీహరి గౌడ్, రాజేష్, సాయి కిశోర్, ఖాజా, మెరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here