మాదాపూర్ డివిజన్ లో రంజాన్ తోఫాలు అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, సుభాష్ చంద్రబోస్ ‌నగర్ మసీద్ ఇ-నూరు,మసీద్ ఇ-అల్మాదుల్లాహ్ ఖాద్రి, మసీద్ ఇ-సిరాజ్ ఉన్నిసా బేగం సాహెబ్ లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి పంపిణీ‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని,‌ సమాజంలో గౌరవం పెంచేలా సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు‌‌. ప్రతి సంవత్సరం రంజాన్ పండగను పురస్కరించుకుని ‌పేద ముస్లింలకు రంజాన్ తోఫాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు‌. పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, ఏకే బాలరాజు యాదవ్,‌ జనరల్ సెక్రటరీ సాంబశివ రావు,‌ మాదాపూర్ డివిజన్ మైనారిటీ అధ్యక్షుడు రహీం, సదర లియాకత్, షోయబ్, రెహ్మాన్, నాయకులు సలీం, బాబూమియా, అంకా రావు, రాములు యాదవ్, మియన్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు షేక్ ఖాజా, యూత్ సభ్యులు మహమ్మద్, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ లోని ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here